‘సాధారణ కాన్పులు జరిగేలా చూడండి’
కరీంనగర్‌టౌన్: వందశాతం గర్భిణుల వివరాలు నమోదు చేసి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు జరిగేలా చూడాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు. బుధవారం జిల్లాలోని వైద్యాధికారులు, ఫా ర్మసిస్టులతో తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇంటింటి సర్వే చేసి, గర్భిణులకు రక్త, మూత్ర పరీక్షలు చేయాలన్నారు. రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు, పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించా రు. అడిషనల్ డీఎంహెచ్‌వో సుజాత, డీఐవో సాజిదా అతహరి, వైద్యులున్నారు.
సైబర్ మోసాలపై అవగాహన అవసరం
కరీంనగర్ క్రైం: సైబర్ మోసాలపై అవగా హన అవసరమని కరీంనగర్ సైబర్ క్రైం ఏసీపీ నరసింహారెడ్డి అన్నారు. బుధవారం కరీంనగర్ సవరన్ స్ట్రీట్‌లోని ప్రభుత్వ బాలి కల జూనియర్ కళాశాలలో సైబర్ నేరాల ని యంత్రణపై అవగాహన కల్పించారు. ఓటీపీ అడిగితే చెప్పొద్దని, ఏపీకే ఫైల్స్ ను క్లిక్ చేయవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలన్నారు. ప్రిన్సిపాల్ నిర్మల, సీఐ సునీల్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment