బీడు భూముల కోసమే బీఆర్‌ఎస్ ఆక్రందన
● డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్ కార్పొరేషన్: తమ బీడు భూములకు రైతు భరోసా రావడం లేదనేదే బీఆర్‌ఎస్ నేతల ఆక్రందన అని డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు కాబోతున్న సందర్భంగా మంగళవారం నగరంలోని ఇందిరాచౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పురం రాజేశం ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. నాయకులు ముందుగా సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంచి, బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ హయాంలో గుట్టలు, కొండలు, బీడు భూములకు రైతుబంధు పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సన్నాలు పండించిన రైతులకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చిన మాదిరిగానే, రైతులకే లాభం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్, బీజేపీలు తమ పద్ధతి మార్చుకోకపోతే అన్నదాతలే గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్, నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, కర్ర సత్యప్రసన్నరెడ్డి, ఆకారపు భాస్కర్‌రెడ్డి, గడ్డం విలాస్‌రెడ్డి, ఎండీ.తాజ్, పులి ఆంజనేయులుగౌడ్, శ్రవణ్‌నాయక్, కొరివి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment