పీవీ పుట్టిన గడ్డపై ‘నవోదయ’ విద్యాలయం
● రాజన్న సిరిసిల్ల జిల్లాకూ మంజూరు చేయండి
● కేంద్ర విద్యాశాఖ మంత్రికి మంత్రి బండి సంజయ్ వినతి
కరీంనగర్‌టౌన్: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న దివంగత పీవీ నర్సింహారావు జన్మించిన ‘వంగర’లో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని, రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి, వినతి పత్రం అందించారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతీ మండలంలో రెండు పాఠశాలలను ప్రధానమంత్రి శ్రీ స్కీమ్ కింద స్థాపించాలని విన్నవించారు. ఈ స్కీం కింద ఎంపికై న ప్రతీ పాఠశాలకు రూ.40 లక్షల చొప్పున నిధులు మంజూరవుతాయని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో టెక్నికల్ యూనివర్సిటీ స్థాపించాలని కోరారు.
ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్
పరీక్ష ఫీజు చెల్లించాలి
విద్యానగర్(కరీంనగర్): రాష్ట్రంలో ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను ఓపెన్ స్కూల్ సొసైటీ విడుదల చేసినట్లు డీఈవో జనార్దన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9 నుంచి 22 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఎస్సెస్సీ విద్యార్థులు ప్రతీ సబ్జెక్టుకు రూ.100, ఇంటర్ విద్యార్థులు రూ.150, ఇంటర్ ప్రయోగ పరీక్షలకు ప్రతీ సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలన్నారు. రూ.25 అపరాధ రుసుముతో జనవరి 23 నుంచి 29 వరకు, రూ.50తో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు, తత్కాల్ రుసుము ఎస్సెస్సీ వారికి రూ.500, ఇంటర్ వారికి రూ.1,000 అదనంగా ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
● మెప్మా పీడీ వేణుమాధవ్
జమ్మికుంట(హుజూరాబాద్): మహిళా సంఘాల ద్వారా పొందిన రుణాలతో మహిళలు వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని మెప్మా పీడీ వేణుమాదవ్ అన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలో మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రుణాలిస్తోందని, వాటిని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. వీధి వ్యాపారులకు లోన్ల ద్వారా నిర్మించిన వెండింగ్ జోన్స్ పరిశీలించారు. ప్రతీ దుకాణదారుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెప్మా ఎండీఎంసీ మానస, డీఈవో సతీశ్, సీఎల్‌ఏ ఆర్పీలు మంజుల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ మరమ్మతులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని టౌన్–1 ఏడీఈ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. 11 కేవీ వేంకటేశ్వర ఫీడర్ పరిధిలోని శివ థియేటర్, కోర్టు వెనక భాగం, జ్యోతినగర్, వేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఖాజీపూర్‌లో..
33/11 కేవీ సాయినగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ ఫీడర్ బైఫరికేషన్ పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఖాజీపూర్‌తోపాటు గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ రఘు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment