కరీంనగర్‌అర్బన్: ఓ వైపు సంక్రాంతి పండుగ. మ రోవైపు రేషన్ బియ్యం కోసం కార్డుదారుల ప్రశ్నల వర్షం వెరసి తమకిదేం శిక్షని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండగ పూట హమాలీలు సమ్మె చేస్తుండగా బియ్యం బస్తాలు రేషన్ దుకాణాలకు చేరలేదు. ప్రతి నెలా 1 నుంచి 15వరకు పంపిణీ చేయాల్సి ఉండగా 6వ తేదీ దాటినా రేషన్ రాకపోవడం ఆందోళనకర పరిణామం. ఈ క్రమంలో సోమవారం కరీంనగర్ ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గోదాం అధికారి ఖాదర్‌తో వాగ్వాదానికి దిగారు. రోజూ కార్డుదారులు రేషన్ దుకాణానికి వస్తున్నారని, వారికి సమాధానం చెప్పలేక అవస్థలు పడుతున్నామని డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రొడ్డ శ్రీనివాస్ వివరించారు. నగరంలో 70కి పైగా రేషన్ దుకాణాలుండగా 40 దుకాణాల వరకు రేషన్ బియ్యం రాలేదని, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితని ఆవేదన వ్యక్తం చేశారు. పిండి వంటకాలకు బియ్యమే కీలకమని కానీ బియ్యమే లేకపోవడంతో కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment