ప్రభుత్వ బడులను చులకన చేయడం తగదు
● మాజీ మేయర్ రవీందర్‌సింగ్
కరీంనగర్: మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్షలను అ ల్ఫోర్స్ విద్యాసంస్థల్లో నిర్వహించడం ప్రభుత్వ పా ఠశాలలను చులకన చేయడమేనని మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ అన్నారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థ అల్ఫోర్స్‌లో కోచింగ్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ స్కూళ్ల ను బలోపేతం చేస్తున్నామని, కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని, ప్రైవేట్ స్కూళ్లను కట్టడి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతుంటే జిల్లాలో మాత్రం కలెక్టర్ పమేలా సత్పతి, డీఈవో జనార్దన్‌రావు ప్ర భుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్ఫోర్స్‌లో శిక్షణ ఇప్పించడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఇ లాంటి పరిస్థితుల వల్ల ప్రభుత్వ పాఠశాలలపై న మ్మకం సన్నగిల్లుతుందని, ఉపాధ్యాయుల మనో భావాలను దెబ్బతీసిన వారవుతామని పేర్కొన్నా రు. ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్న అల్ఫోర్స్ చైర్మ న్ నరేందర్‌రెడ్డి విద్యాసంస్థలో శిక్షణ ఇవ్వడం ఎన్ని కల నిబంధన ఉల్లంఘించడమేనని ఆరోపించారు. పైగా శిక్షణ తరగతులకు హాజరు కాని టీచర్లకు నోటీసులు జారీ చేయడం సరికాదన్నారు. శిక్షణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఒలింపియాడ్ శిక్షణపై ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహిస్తున్న జిల్లా కలెక్టర్, డీఈవోలపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేస్తామన్నారు. నాయకులు హరిప్రసాద్, పెండ్యాల మహేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment