జగిత్యాలటౌన్: జగిత్యాల జిల్లా కళాశ్రీ సాహితీవేదిక ఆధ్వర్యంలో ఈనెల 11న అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి పురస్కారాలు అందించనున్నట్లు కళాశ్రీ అధినేత గుండేటి రాజు, ప్రోగ్రాం కన్వీనర్ ఏవీఎన్.రాజు తెలిపారు. జిల్లాకేంద్రంలోని శివసాయి రెసిడెన్సీలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సినీనటుడు సత్తన్న హాజరవుతున్నారని తెలిపారు. కరీంనగర్‌కు చెందిన కవి, రచయిత కల్వకుంట్ల రామకృష్ణ, పొన్నం రవిచంద్ర, రచయిత, గాయకులు టి.మురళిమధు, హైదరాబాద్‌కు చెందన రచయిత్రి రాధకుసుమ, డి.వాణి, మాదారపు వాణిశ్రీ, హన్మకొండకు చెందిన మాదారపు వాణిశ్రీ చేతులమీదుగా పురస్కారాలు అందించనున్నట్లు సంధానకర్తలు మద్దెల సరోజన, అయిత అనిత, లక్కరాజు శ్రీలక్ష్మి, వంగ గీతారెడ్డి, నమిలకొండ సాకేత తెలిపారు. సాహిత్య అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment