● సముదాయంలోని 126 దుకాణాలను అర్హులైన వీధివ్యాపారులకు కేటాయించాల్సి ఉండగా, పలు ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ వ్యవహారం ఏళ్లుగా వాయిదాలు పడుతూ, మలుపులు తిరుగుతూ వచ్చింది.
● గతేడాది లక్కీ డ్రా ద్వారా దుకాణాలు కేటాయించేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే దుకాణ సముదాయ నిర్మాణానికి ముందు అదే స్థలంలో వీధివ్యాపారాలు చేసుకున్న వారికి నేరుగా షట్టర్లు కేటాయించాలనే డిమాండ్‌తో పలువురు కోర్టును ఆశ్రయించారు.
● కోర్టుకు వెళ్లిన 75 మందిలో అర్హులైన వీధివ్యాపారుల (దుకాణ సముదాయం నిర్మించడానికి ముందే అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్నవాళ్లు)ను గుర్తించి, వారికి నేరుగా షాపులు కేటాయించాలని కోర్టు ఆదేశించింది.
● దీంతో నగరపాలకసంస్థ, మెప్మా అధికారులు సర్వే నిర్వహించి పాత వీధి వ్యాపారుల జాబితా రూపొందించారు. కాగా, పాత వీధి వ్యాపారుల జాబితాలో అనర్హులకు కూడా చోటు కల్పించారనే ఆరోపణలు వచ్చాయి.
● ఒకసారి ఒక జాబితా, మరోసారి అదనంగా మరో జాబితా, కొన్ని పేర్ల తొలగింపు, మరికొన్ని పేర్ల జోడింపు తదితర పరిణామాల క్రమంలో ఈ ఆరోపణలకు బలం చేకూరింది.
● షాప్‌లు కేటాయిస్తామని డబ్బులు వసూలు చేసిన వారే పలు మార్గాల ద్వారా పాత వీధి వ్యాపారుల జాబితాలోకి తమ వాళ్లను చొప్పించినట్లు సామాజిక కార్యకర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
● అలాగే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు, ముగ్గురి పేర్లు ఉన్నట్లు అధికారుల దృష్టికి తీసుకురావడంతో, చివరకు ఐదుగురిని తొలగించి 48 మందితో ప్రస్తుతం జాబితా రూపొందించారు.
● సోమవారం నాటి డ్రా వరకు ఈ జాబితాలో ఎన్ని మార్పులు ఉంటాయో అనే చర్చ కూడా మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment