సామాజిక సేవలో ముందుండాలి
కరీంనగర్‌రూరల్/కొత్తపల్లి(కరీంనగర్): కులమతాలకు అతీతంగా మున్నూరుకాపులు సామాజిక సేవ చేసేందుకు ముందుకు రావాలని హైకోర్టు జడ్జి ఈవీ వేణుగోపాల్ కోరారు. ఆదివారం బొమ్మకల్ బైపాస్ టీవీ గార్డెన్‌లో మున్నూరుకాపు, పటేల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హైకోర్టు జడ్జి, కర్నాటక సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బట్టు సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 2025 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, మున్నూరు కాపులు ఐక్యతతో ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం కాపువాడకు చెందిన కరబత్తుల సంపత్‌కుమార్ తన మరణానంతరం మెడికల్ కళాశాలకు శరీరదానం చేసేందుకు అంగీకారపత్రం రాసివ్వడంతో అభినందించారు. సంఘం ప్రతినిధులు పోగుల ఆంజనేయులు, యాదిగిరి, భూమయ్య, పురుమల్ల శ్రీనివాస్, తోట కిరణ్‌కుమార్, చింతల కిషన్ తదితరులు పాల్గొన్నారు.
రేకుర్తి ఆసుపత్రికి విరాళం
రేకుర్తిలోని డాక్టర్ మడేకర్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఉదార నేత్ర వైద్యశాలకు హైకోర్టు జడ్జి ఈవీ వేణుగోపాల్ రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఆదివారం ఆసుపత్రిని సందర్శించిన జడ్జికి అందులోని సౌకర్యాలను ట్రస్ట్ చైర్మన్ కొండ వేణుమూర్తి వివరించగా సంతృప్తి వ్యక్తం చేశారు. తన తండ్రి టైక్స్‌టైల్స్ అండ్ హాండ్లూమ్స్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ స్వర్గీయ ఈవీ రాజేశ్వర్‌రావు పేరిట పేదల కంటి ఆపరేషన్ల కోసం రూ.లక్ష విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణ మలేషియా అసోసియేషన్ అధ్యక్షుడు సైదం తిరుపతి రూ.50 వేల విరాళం ప్రకటించారు. పేదలకు అండగా నిలిచేందుకు ముందకు వచ్చిన జస్టిస్ వేణుగోపాల్, తిరుపతిలను ఆసుపత్రి యాజమాన్యం సత్కరించింది. ప్రోటాకాల్ రాజేశ్వర్‌రావు, ప్రకాష్‌హొళ్లా, కోల అన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు జడ్జిని కలిసిన ‘బార్’ అధ్యక్షుడు
కరీంనగర్‌క్రైం: హైకోర్డు జడ్జి వేణుగోపాల్ ఆదివారం కరీంనగర్‌కు రాగా ఆయనను వారి స్వగృహంలో కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ రాజకుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేశారు.
హైకోర్టు జడ్జి వేణుగోపాల్
Comments
Please login to add a commentAdd a comment