అప్రంటిస్‌షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం
జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని ఎన్టీపీసీలో ఐటీఐ అప్రంటిస్‌షిప్ కోర్సుల్లో చేరుందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ మానవ వనరుల విభాగం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఐటీఐ పూర్తిచేసిన వారు ఒక సంవత్సరం పాటు అప్రంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేయాలని సూచించిది.
ట్రేడ్స్ వివరాలు..
ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, ఇన్స్‌ట్రుమెంట్ మెకానిక్
అర్హత ప్రమాణాలు:
● జనవరి 2021 లేదా ఆ తర్వాత సంవత్సరంలో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
● స్థానిక అభ్యర్థులు.. అంటే.. పెద్దపల్లి జిల్లా నుంచే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయో పరిమితి:
అభ్యర్థులు 1 జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు, లేదా 24 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగి ఉండాలి.
(ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గరిష్ట వయో పరిమితి సడలిస్తారు)
విద్యార్హతలు:
మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత. ఎన్‌సీవీటీ ద్వారా గుర్తింపు.
● ఐటీఐ ట్రేడ్ అర్హత : అభ్యర్థులను ఎంపిక చేసుకునేటప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ కోసం ప్రభుత్వ రిజర్వేషన్ మార్గదర్శకాలు అనుసరిస్తారు.
దరఖాస్తు చేయడానికి మార్గదర్శకాలు:
● అభ్యర్థులు తప్పనిసరిగా పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి www. apprenticeshipindia.org.
● బయోడేటా, అప్లికేషన్ ఫార్మాట్‌లను రామగుండం ఎన్టీపీసీ టీటీఎస్ ఉద్యోగ వికాస కేంద్రం నుంచి పొందవచ్చు.
● దరఖాస్తు చేసిన అనంతరం పూర్తి వివరాలతో ఉన్న పత్రాలను ఉద్యోగ వికాస కేంద్రంలోని బాక్స్‌లో వేయాలి.
జతచేయాల్సిన పత్రాలు..
ఎస్సెస్సీ, ఐటీఐ మెమోలు, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణపత్రం, పోర్టల్‌లో ఎన్‌రోల్‌మెంట్ నంబర్ కాపీ.
సూచనలు:
● ఇప్పటికే అప్రెంటిస్‌షిప్ చేసిన అభ్యర్థులు లేదా ఏదైనా సంస్థలో అప్రెంటిస్‌షిప్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు కాదు.
● ఎస్సెస్సీ మెమో/సర్టిఫికెట్‌లోని పేరు ఆధార్‌కార్డ్‌తో సరిపోవాలి.
● ఎన్టీపీసీ భూనిర్వాసితుల పిల్లలు, ఎన్టీపీసీ ఉద్యోగుల పిల్లలు, సీఐఎస్‌ఎఫ్ పిల్లలు తప్పనిసరిగా సంబంధిత సర్టిఫికెట్, గుర్తింపుకార్డు, గేట్‌పాస్‌లను రుజువుగా జతచేయాలి. అభ్యర్థి తమ దరఖాస్తును అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో సమర్పించాలి.
● పోర్టల్‌లో సమర్పించిన పత్రాలను ఈడీసీలోని బాక్స్‌లో వేయాలి. –ఎన్‌క్లోజర్‌లు లేని దరఖాస్తులు అంగీకరించరు.
● దరఖాస్తు దాఖలుకు చివరి తేదీ: ఈనెల18 (18జనవరి 2025).
ఉత్తర్వులు జారీచేసిన ఎన్టీపీసీ మానవ వనరుల విభాగం
Comments
Please login to add a commentAdd a comment