కలెక్టర్, అగ్రికల్చర్ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలి
● ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
రాయికల్(జగిత్యాల): రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన కలెక్టర్, అగ్రికల్చర్ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా రాయికల్‌లో మట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జీవోలకు విరుద్ధంగా భూమి సాగు చేయని రైతులకు సైతం అధికారులు రైతుబంధు పథకం కింద నిధులు మంజూరు చేశారని, దీంతో వేలాది కోట్ల నిధులు దుర్వి నియోగమయ్యాయని ఆరోపించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్‌రెడ్డి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నారని గుర్తుచేశారు.
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
పెద్దపల్లిరూరల్: ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన రావుల చారి(55) చాలాకాలంగా భార్యాపిల్ల లకు దూరంగా ఉంటున్నాడు. శుక్రవారం పెద్దపల్లి పట్టణ శివారులోని పెద్దపల్లి–మంథని రైల్వే వంతెన సమీపంలో నాగ్‌పూర్ నుంచి సికి ంద్రాబాద్ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడ్డాడు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి వద్ద లభించిన ఫోన్ నంబర్ ఆధారంగా అతని కుమారుడు సందీప్‌కు సమాచారం ఇచ్చి, మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ పేర్కొన్నారు.
వలకు చిక్కిన కొండచిలువ
జగిత్యాలరూరల్: ధరూర్ శివారులోని వాగులో శుక్రవారం మత్స్యకారులు చేపలు పట్టేందుకు వల విసిరారు. అందులో భారీ కొండచిలువ చిక్కింది. స్థానికుల సహాయంతో బయటకు తీసి, అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వారు కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
కోతులకు ఆహారం..
వాహనదారుకు జరిమానా
భీమారం: మంచిర్యాల–చెన్నూర్ జాతీయ రహదారిపై భీమారం సమీపంలో శుక్రవారం కోతులకు ఆహారం అందించిన వాహనదారు కు రూ.3వేల జరిమానా విధించినట్లు మంచిర్యాల ఎఫ్‌డీవో సర్వేశ్వర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా ముగ్దుంపూర్‌కు చెందిన బండి ఓదెలు వాహనంలో వెళ్తూ అటవీ ప్రాంతంలో కో తులు కనిపించగానే వాటికి ఆహారం వేశాడని తెలిపారు. దీంతో ఆయనకు జరిమానా విధించామన్నారు. వాహనచోదకులు, ప్రయాణికులు రిజర్వు ఫారెస్టులో రోడ్డుపై సంచరించే కోతులకు ఆహారం వేయొద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment