మద్యానికి బానిసైన కొడుకులు
● మనస్తాపంతో పురుగుల మందు తాగిన తండ్రి
● చికిత్స పొందుతూ మృతి
వెల్గటూర్(ధర్మపురి): చేతికంది వచ్చి న కొడుకులు మద్యానికి బానిసగా మారి జులాయిగా తిరుగుతుండడంతో మనస్తాపం చెందిన తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు య త్నించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన బలాస్థి గంగాధర్(48)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు మద్యానికి బానిసై ఏ పనీ చేయకుండా జులాయిగా తిరగడానికి అలవాటుపడ్డారు. తండ్రి ఎన్ని సార్లు చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. డిసెంబర్ 31న ఇద్దరు కొడుకులు బాగా మద్యం తాగి తండ్రితో గొడవకు దిగారు. దీంతో మనస్తాపం చెందిన గంగాధర్ పురుగుల మందు తాగాడు. అతడిని బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment