‘అల్ఫోర్స్’లో సావిత్రిబాయి పూలేకు నివాళి
కొత్తపల్లి(కరీంనగర్): స్థానిక అల్ఫోర్స్ ఇ–టెక్నో స్కూల్లో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళి అర్పించారు. మన దేశంలో తొలి మహిళా టీచర్‌గా సావిత్రిబాయి ప్రత్యేక గుర్తింపు పొందారని, ఆమె ఆశయసాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని టీచర్లు సూచించారు. తన రచనల ద్వారా సీ్త్రలను జాగృతం చేసి, విద్యారంగంలో రాణించేలా చూశారని కొనియాడారు. భర్త జ్యోతిబాపూలేతో కలిసి, గ్రామాల్లో పర్యటించి, మహిళలను చైతన్యపరిచారని, సీ్త్ర విద్య కోసం పలు పాఠశాలలను స్థాపించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment