ప్రయాణికుడికి బ్యాగు అప్పగింత
వేములవాడ అర్బన్: ఓ ప్రయాణికుడు బాత్‌రూంకు వెళ్లొచ్చేసరికి ఆర్టీసీ బస్సు వెళ్లిపోయింది. అందులో అతని బ్యాగు ఉంది. బాధితుడు ఆర్టీసీ అధికారులకు విషయం తెలపడంతో తిరిగి అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డికి చెందిన మొండయ్య గురువారం ఉదయం కరీంనగర్ వెళ్లేందుకు కామారెడ్డి డిపోకు చెందిన బస్సు ఎక్కాడు. సిరిసిల్ల బస్టాండ్‌లో దిగి, బాత్‌రూంకు వెళ్లొచ్చేరికి బస్సు వెళ్లిపోయింది. దీంతో అతను కంట్రోలర్‌ను కలిసి, విషయం చెప్పాడు. అధికారి వెంటనే వేములవాడ ఆర్టీసీ బస్టాండ్‌లోని కంట్రోలర్‌కు ఫోన్ చేసి, ప్రయాణికుడు బస్సులో బ్యాగు మరిచిపోయినట్లు తెలిపారు. అక్కడి ఆర్టీసీ సిబ్బంది ఆ బ్యాగు తీసుకొని, మొండయ్య వచ్చాక అప్పగించారు. అందులో రూ.70 వేలు ఉన్నట్లు బాధితుడు పేర్కొన్నాడు. బ్యాగు అప్పగించిన ఆర్టీసీ సిబ్బంది సత్యనారాయణ, శ్రీనివాస్‌లకు కృతజ్ఞతలు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment