చందుర్తి(వేములవాడ): చందుర్తి పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ శంకరయ్యను ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం రాత్రి సస్పెండ్ చేశారని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్‌హెచ్‌వోగా పని చేసిన సమయంలో విధుల పట్ల శంకరయ్య నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణల మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, బుధవారం ఎస్పీ అఖిల్ మహాజన్ ఠాణాను ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో సిబ్బంది ఎవరు ఏ విధులు నిర్వహిస్తున్నారో స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పని చేసేందుకు ఇబ్బంది పడుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా కార్యాలయానికి అటాచ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా 6 నెలల కాలంలో ఠాణాలో ఎస్‌హెచ్‌వోలు పని చేసిన ఎస్సై శ్రీకాంత్, ఏఎస్సై బాపులను జిల్లా కార్యాలయానికి అటాచ్ చేయగా, హెడ్ కానిస్టేబుల్ శంకరయ్యను ఏకంగా సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. శంకరయ్య 4 నెలల క్రితమే ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. వరుస ఘటనలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని చందుర్తి ఠాణా సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.
డీఎఫ్‌ఆర్‌వో హఫీజుద్దీన్..
మెట్‌పల్లి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీఎఫ్‌ఆర్‌వో హఫీజుద్దీన్‌ను ఉన్నతాధికారులు సస్పె ండ్ చేసినట్లు రేంజ్ ఆఫీసర్ షౌకత్ అలీ గురువారం తెలిపారు. ఇబ్రహీంపట్నం సెక్షన్ అఫీసర్ చైతన్యకు అదనంగా డీఎఫ్‌ఆర్‌వో బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. అటవీ సిబ్బంది ఇబ్బందులకు గురిచే స్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇద్దరు కానిస్టేబుళ్లు అటాచ్?
Comments
Please login to add a commentAdd a comment