● వివిధ జిల్లాల నుంచి కరీంనగర్‌కు.. ● నేడో, రేపో కౌన్సెలింగ్
కరీంనగర్: ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న స్పౌజ్ కేటగిరీకి సంబంధించిన బదిలీలకు మోక్షం లభించింది. వివిధ జిల్లాల నుంచి కరీంనగర్‌కు 143 మంది ఉపాధ్యాయులు వచ్చారు. బు ధవారం సాయంత్రం నుంచి డీఈవో ఆఫీస్‌లో రిపోర్టు చేస్తున్నారు. నేడో, రేపో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, దంపతులకు ఒకేచోట లేదా సమీప పాఠశాలలో పోస్టింగ్ ఇవ్వనున్నారు.
సబ్జెక్టులవారీగా టీచర్ల వివరాలు..
ఎస్జీటీలు జగిత్యాల జిల్లా నుంచి 19 మంది, పెద్దపల్లి నుంచి 52 మంది, రాజన్నసిరిసిల్ల నుంచి 29 మంది, జయశంకర్ భూపాలపల్లి నుంచి 02, సిద్దిపేట నుంచి 09 మంది స్పౌజ్ కేటగిరీలో జిల్లాకు వచ్చారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌లు జగిత్యాల జిల్లా నుంచి ఇద్దరు, ఎస్‌ఏ–తెలుగు ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఇద్దరు, రాజన్నసిరిసిల్ల నుంచి ఇద్దరు, ఎస్‌ఏ–ఇంగ్లిష్ సిద్దిపేట నుంచి ఒకరు, ఎస్‌ఏ–మ్యాథ్స్ జగిత్యాల నుంచి ఇద్దరు, రాజన్న సిరిసిల్ల నుంచి ఐదుగురు, సిద్దిపేట నుంచి ఒకరు, ఎస్‌ఏ– బయోసైన్స్ జగిత్యాల నుంచి ఇద్దరు, రాజన్న సిరిసిల్ల నుంచి ఒకరు, ఎస్‌ఏ–ఫిజికల్ సైన్స్ జగిత్యాల నుంచి ఒకరు, రాజన్నసిరిసిల్ల నుంచి ఒకరు, ఎస్‌ఏ–సోషల్ జగిత్యాల నుంచి ఒకరు, రాజన్న సిరిసిల్ల నుంచి ఒకరు, ఎస్జీటీ–ఉర్దూ జగిత్యాల నుంచి ఒకరు, పెద్దపల్లి నుంచి ఇద్దరు, జయశంకర్ భూపాలపల్లి నుంచి ఒకరు, ఎస్‌ఏ–ఫిజికల్ సైన్స్ (ఉర్దూ మీడియం) జగిత్యాల నుంచి ఒకరు, ఎస్‌ఏ–ఫిజికల్ ఎడ్యుకేషన్ పెద్దపల్లి నుంచి ఒకరు, రాజన్న సిరిసిల్ల నుంచి ఒకరు బదిలీపై వచ్చారు. మొత్తంగా జగిత్యాల నుంచి 32 మంది, పెద్దపల్లి నుంచి 57 మంది, రాజన్న సిరిసిల్ల నుంచి 41 మంది, జయశంకర్ భూపాలపల్లి నుంచి ముగ్గురు, సిద్దిపేట నుంచి 10 మంది మొత్తం 143 మంది వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment