నూతన ఆవిష్కరణలు రూపొందించాలి
కరీంనగర్‌సిటీ: కరీంనగర్ ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వృక్షశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో బుధవారం ఒక్కరోజు జాతీయ ఆన్‌లైన్ సెమినార్ నిర్వహించారు. ఉన్నత విద్య, పరిశోధన, మేధోసంపత్తి హక్కులపై ఒడిశా రాష్ట్రానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తోగాపూర్ పవన్‌కుమార్ కీలక ఉపన్యాసం చేశారు. కరీంనగర్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ.. మేధోసంపత్తి హక్కులు విద్య, పరిశోధన రంగంలో నేడు అత్యవసరమన్నారు. నూతన ఆవిష్కరణల రూపకల్పన దిశగా విద్యార్థులు, అధ్యాపకులు ముందుకెళ్లాలని సూచించారు. ఆధునిక సాంకేతిక ప్రక్రియ, కత్రిమ మేధతో వినూత్న రీతిలో మరిన్ని ఆవిష్కరణలు చేసి, మన దేశాన్ని ముందు వరుసలో ఉంచాలని కామారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ కోరారు. వృక్షశాస్త్ర భాగాధిపతి, పరీక్షల నియంత్రణ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సెమినార్‌లో దేశంలోని 17 రాష్ట్రాలకు చెందిన వివిధ విశ్వవిద్యాలయాల సహాయ ఆచార్యులు, సైంటిస్టులు, పరిశోధక విద్యార్థులు భాగస్వాములయ్యారని తెలిపారు. కామారెడ్డి కళాశాల వృక్షశాస్త్ర విభాగాధిపతి దినకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు తిరుపతి, శ్రీవల్లి, అధ్యాపకులు రౌతు రాధాకృష్ణ, మహమ్మద్ తాహీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment