![మాట్లాడుతున్న డాక్టర్ వేణుగోపాల్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/1/28kol05-120026_mr.jpg.webp?itok=LC65v50c)
మాట్లాడుతున్న డాక్టర్ వేణుగోపాల్
కోలారు: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్రను ప్రారంభిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం ఆయన పాత్రికేయుల భవనంలో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రజలను నేరుగా కలవడానికి ప్రారంభిస్తున్న విజయ సంకల్ప యాత్ర జిల్లాలో ఈనెల 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు సాగుతుందన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 రోజుల పాటు సంచరించి విజయమే లక్ష్యంగా ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు విజయసంకల్ప యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో నిర్వహించే సంకల్ప యాత్రలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ నాయకుడు వెంకటమునియప్ప, తాలూకా అధ్యక్షుడు రామచంద్రేగౌడ, నగర అధ్యక్షుడు తిమ్మరాయప్ప, సత్యనారాయణ, కెంబోడి నారాయణస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment