మాట్లాడుతున్న నాటక రచయిత కరియప్ప
కోలారు : రంగమందిరంలో ఈ నెల 7న టిప్పు నిజకనుసుగళు నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నాటక రచయిత అడ్డాండ సి కరియప్ప తెలిపారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నాటకంలో టిప్పు తన పాలనలో చేసిన దుర్మార్గాలు, మతమార్పిళ్లు, దౌర్జన్యాలు, హత్యల గురించి తెలియజేస్తారన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ప్రదర్శించిన ఈ నాటక ప్రదర్శనలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. తన నాటకం ముస్లింలకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదన్నారు. చరిత్ర గురించి భావితరాలకు సరైన సమాచారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తాను ఈ నాటకం రచించినట్లు తెలిపారు. నాటకం టికెట్ ధర రూ.100 అని, ఇప్పటికే అన్ని టికెట్లు బుక్ అయ్యాయన్నారు. కేజీఎఫ్ మాజీ ఎమ్మెల్యే వై.సంపంగి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్, ఎస్‌బీ మునివెంకటప్ప పాల్గొన్నారు.
7న యోగినారాయణ
యతీంద్రుల జయంతి
కోలారు : నగరంలోని చెన్నయ్య రంగమందిరంలో ఈ నెల 7న యోగి నారాయణ యతీంద్రుల జయంతిని నిర్వహిస్తున్నట్లు జిల్లా బలిజ సంఘం డైరెక్టర్ వెంకటస్వామి తెలిపారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 10 గంటలకు తాతయ్య చిత్రపటాలతో కూడిన పల్లకీలను నగరంలోని ప్రధాన వీధుల్లో ఊరేగిస్తారన్నారు. రంగమందిరంలో కార్యక్రమాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మునిరత్న ప్రారంభిస్తారన్నారు. ఎంపీ ఎస్.మునిస్వామితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ ప్రతిభాన్విత విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందిస్తారన్నారు. జయంతి ఆచరణ సమితి అధ్యక్షుడు రఘు, రవీంద్రకుమార్, మంజునాథ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment