యువతకు మత్తు మాత్రలే డ్రగ్స్‌గా..
తుమకూరు: తుమకూరు నగరంలో విద్యార్థులకు, యువతకు మత్తు పదార్థాలను విక్రయిస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్న 7 మందిని హోస బడావణె ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో మెడికల్ షాపు సిబ్బంది కూడా ఉండడం గమనార్హం. నగర సమీపంలో యల్ళాపురలో ఓ కార్పొరేట్ మెడికల్ షాప్‌లో పనిచేచే భానుప్రకాశ్ (32), మెడికల్ రెప్ రాఘవేంద్ర(43), ఫూజారనహళ్ళి అభిషేక్ (23), క్యాత్సంద్రవాసి మహ్మద్ సైఫ్ (22), సయ్యద్ లుక్కాన్ (23), అఫ్తాబ్ (23), గురురాజ్ హెచ్.ఎస్.(28) అరెస్టయ్యారు.
ఇలా జరుగుతోంది
హోసబడావనె ఠాణా పరిధిలోని ఎస్‌ఐటి లేఔట్, రైలు పట్టాలు, ఉప్పారహళ్ళి వంతెన, శ్రీదేవి కళాశాల వద్ద దందా సాగుతోంది. డాక్టర్ సూచనతో రోగులకు మాత్రమే ఇవ్వాల్సిన మత్తు మాత్రలను నిందితులను సేకరించి విద్యార్థులకు అమ్మేవారు. వాటికి అలవాటు పడిపోవడంతో ఎంత రేటైనా కొనుగోలు చేసేవారు. మెడికల్ రెప్ బెంగళూరు నుంచి మత్తు మాత్రలను బెంగళూరు నుంచి వందల కొద్దీ తీసుకొచ్చేవాడు. వాటికి విద్యార్థిల నుంచి ఎక్కువ గిరాకీ ఉండటంతో బెంగళూరు నుంచి పెద్దసంఖ్యలో మాత్రలను తీసుకొచ్చి విద్యార్థులకు అమ్మేవారు. శ్రీదేవి కాలేజీ వద్ద ఉన్న పారిశ్రామికవాడలో గుట్టుగా అమ్మేవారు. బెంగళూరులో 10 టాబ్లెట్ల షీట్‌ను రూ. 350 కి కొనుగోలు చేసి యువకులకు రూ. 800 అమ్మేవారు. ఈ దందా గురించి సమాచారం అందడంతో పోలీసులు దాడులు జరిపి అరెస్టుచేశారు. వారి నుంచి 300 టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
తుమకూరులో దందా
మెడికల్ షాపు సిబ్బంది అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment