దొడ్డబళ్లాపురం: తనపై కోపంతో రాష్ట్ర ప్రభుత్వం కుదురేముఖ్ ఇనుప ఖనిజం కంపెనీని మూసివేసేందుకు కుట్ర చేస్తోందని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. ఆదివారంనాడు హాసన్ జిల్లా చెన్నరాయపట్టణలో మీడియాతో మాట్లాడిన ఆయన తాను రాష్ట్రంలో ఫ్యాక్టరీలు, కంపెనీలను సందర్శించి ప్రధాని మోదీతో చర్చించి వాటి సమస్యలను పరిష్కరించానన్నారు. అయితే రాష్ట్రం నుండి ఎవరూ వచ్చి ఇది కావాలని అడగలేదన్నారు. కుదురెముఖ్ కంపెనీకి చెందిన మంగళూరు ఫ్యాక్టరీని మూసివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఎత్తులు వేసిందన్నారు. హెచ్‌ఎంటీ ఫ్యాక్టరీపైనా కుట్ర చేసిందన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌లోని స్టీల్ ఫ్యాక్టరీని కాపాడగలిగానన్నారు. ఇదే ఉత్సాహంతో భద్రావతిలోని ఇనుము–ఉక్కు ఫ్యాక్టరీని పునః ప్రారంభానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్ గురించి విమర్శించే నైతికత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment