రాష్ట్ర బడ్జెట్‌పై సీఎం కసరత్తు
సాక్షి బెంగళూరు: కేంద్ర బడ్జెట్ ముగిసింది.. ఇక కన్నడ ప్రజల చూపు రాష్ట్ర బడ్జెట్‌పై పడింది. ఫిబ్రవరి నెలలోనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర బడ్జెట్‌ను తీసుకురానున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి బడ్జెట్ సిద్ధతా సమావేశాలను నిర్వహిస్తారు. ఇప్పటికే ఒక దఫా సమావేశాలు జరిపి నిధుల కేటాయింపులు, నిధుల వినియోగం తదితర అంశాలపై చర్చించారు. సోమవారం వ్యవసాయ, బెంగళూరు నగరాభివృద్ధి, జలవనరులు, పట్టు, పశుసంవర్థక శాఖల అధికారులతో సిద్దరామయ్య సమావేశమవుతారు. ఇక మంగళవారం ప్రాథమిక, ఉన్నత విద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమం, రెవెన్యూ, నగరాభివృద్ధి, పౌరసరఫరాలు, మైనారిటీ, సాంఘిక సంక్షేమం, రవాణా, దేవాదాయ, న్యాయ శాఖ, పర్యాటకం, బీసీ వర్గాల సంక్షేమం, కన్నడ సాంస్కృతిక సంక్షేమ శాఖలతో సమీక్ష ఉంటుంది. 7వ తేదీ వరకు సమీక్షలు జరిపి అంచనాలను స్వీకరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment