![ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రామేగౌడ - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/8/07kol02-120039_mr.jpg.webp?itok=x2MEAMhb)
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రామేగౌడ
ఆరోగ్యంపై జాగృతి జాతా
కోలారు: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేడీఏపీ ఆధ్వర్యంలో నగరంలో జాగృతి జాతా నిర్వహించారు. జాతాను డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ జగదీష్ ప్రారంభించారు. త్రివిధ ఆరోగ్య సూత్రాలు వ్యాయామం, యోగా, సమతుల ఆహార పద్ధతును పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. జాతా అనంతరం అంతరగంగ పర్వత పాదం వద్ద యోగా నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీహరి, డాక్టర్ నరేంద్ర, డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ అంబరీష్, డాక్టర్ ఆశా తదితరులు ఉన్నారు.
అవినీతి రహిత పాలన అందిస్తా
మాలూరు: వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ నుంచి పోటీ చేస్తున్న తనను గెలిపించాలని జేడీఎస్ అభ్యర్థి రామేగౌడ ప్రజలను కోరారు. శుక్రవారం మాస్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తనను గెలిపిస్తే అవినీతి రహిత పాలన అందించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సౌకర్యాలను కల్పించడంతో పాటు 10 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానన్నారు.
ఘనంగా హనుమ జయంతి
రాయచూరు రూరల్: జిల్లాలో హనుమ జయంతిని ఘనంగా ఆచరించారు. ఐబీ రోడ్డులో వెలసిన వరసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం రాత్రి కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, ఆలయ ట్రస్టీ రాజా శంకర్ ప్రత్యేక అలంకరణలో హనుమంతుడికి పూజలు జరిపారు. భక్తులు ఊయల సేవ, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
బీజేపీ టికెట్ ఇవ్వాలని ధర్నా
కేజీఎఫ్: బీజేపీ టికెట్‌ను మోహనకృష్ణకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు శుక్రవారం పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘం మాజీ అధ్యక్షుడు రబిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మోహనకృష్ణ గత నాలుగేళ్లుగా పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. మోహన్‌కృష్ణకు హైకమాండ్ టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలుపు ఖాయమన్నారు. ఈ సందర్భంగా జీపీ అధ్యక్షుడు రఘు, శ్రీనివాస్, శ్రీనాథ్, సుధాకర్ రెడ్డి, తేజు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ప్రవేశానికి
న్యాయపోరాటం చేస్తాం
హుబ్లీ: జెడ్పీ సభ్యుడి హత్య కేసులో బెయిల్‌పై ఉన్నప్పటికీ జిల్లాలోకి ప్రవేశించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలో ధార్వాడ గ్రామీణ కాంగ్రెస్ టికెట్ కేటాయించిన మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి ధార్వాడ జిల్లాలో ప్రవేశం కోసం న్యాయపరంగా పోరాటం చేస్తామని మంత్రి భార్య శివలీల తెలిపారు. ధార్వాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు వినయ్ కులకర్ణి శివళ్లి గ్రామంలో దుర్గాదేవికి పూజ చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టేవారన్నారు. అందుకోసమే తాను అక్కడ పూజలు చేసినట్లు ఆమె తెలిపారు. నియోజకవర్గంలోని వినయ్ కులకర్ణి రావాలని ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఆ మేరకు పార్టీ టికెట్ కూడా లభించిందని ఆమె అభిప్రాయపడ్డారు. వినయ్ కులకర్ణిని రాజకీయంగా అనగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గ ప్రజల ఆదరణ వల్ల పార్టీ టికెట్ కేటాయించిందన్నారు. న్యాయపరంగా తన భర్తకు జిల్లాలో ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతి లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ముఖ్యమంత్రి బొమ్మై సారధ్యం వహించిన శిగ్గాంవి నుంచి ఈసారి వినయ్‌కులకర్ణి పోటీ చేస్తారన్న ఊహగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ విషయంపై శివలీల స్పందిస్తూ అదంతా మీడియా సృష్టే అని, ధార్వాడ గ్రామీణ క్షేత్రం వదిలి వీరే చోటకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
రాయచూరు రూరల్: మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఐఈసీ అధికారి ధన్‌రాజ్ సూచించారు. ఆయన శుక్రవారం తాలూకాలోని బిజినగేరలో జాతీయ ఉద్యోగ ఖాత్రి పథకంలో భాగంగా వ్యవసాయ కూలీలకు ఓటు హక్కుపై జాగృతి కల్పించి ఆయన మాట్లాడారు.
![ప్రమాణం చేస్తున్న నరేగ కూలీ కార్మికులు 1](https://www.sakshi.com/gallery_images/2023/04/8/07blr15-120011_mr.jpg)
ప్రమాణం చేస్తున్న నరేగ కూలీ కార్మికులు
Comments
Please login to add a commentAdd a comment