![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/19/144.jpg.webp?itok=wzh5dOwU)
శివాజీనగర: విధానసభ ఎన్నికల సమయంలో ధారవాడకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ మాజీ మంత్రి వినయ్ కులకర్ణి సమర్పించిన దరఖాస్తు సస్పెండ్ కావటంతో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ధారవాడ బీజేపీ జిల్లా పంచాయతీ సభ్యుడు యోగీశ్ గౌడ హత్య కేసులో ఆయన నిందితుడు. ధారవాడ ప్రవేశానికి అనుమతి కోరుతూ బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల న్యాయస్థానంలో దరఖాస్తు సమర్పించారు. ఏప్రిల్ 15న వినయ్ కులకర్ణి దరఖాస్తు విచారణను పూర్తి చేసిన కోర్టు ఏప్రిల్ 18కి తీర్పు రిజర్వులో ఉంచింది.
సీబీఐ వాదన ఏమిటి?
యోగేశ్ గౌడ కేసులో 120 సాక్షుల్లో 90 మంది ధారవాడకు చెందినవారు. వినయ్ కులకర్ణికి నియోజకవర్గానికి వస్తే అక్రమాలకు పాల్పడవచ్చు. కేసు విచారణకు సమస్య కావచ్చు. సాక్షులను బెదిరించే అవకాశముంది. ఏ కారణానికి ప్రవేశానికి అనుమతి ఇవ్వరాదని సీబీఐ తరపు న్యాయవాది బలమైన వాదనను వినిపించారు.
సీటు మారుతుందా?
కాంగ్రెస్ తన అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసి ధారవాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి టికెట్ ఇచ్చారు. వినయ్ కులకర్ణి ప్రస్తుతం ధారవాడ ప్రవేశానికి అనుమతి ఇవ్వని కారణాన కాంగ్రెస్ ముందు ఏ నిర్ధారణ తీసుకొంటుందోనని కుతూహలం పెరిగింది. ధారవాడ ప్రవేశం కల్పించకపోతే వినయ్ కులకర్ణి శిగ్గాంవి నియోజకవర్గం ఉండి పోటీ చేసే అవకాశం ఉందని మాటలు ఇంతకు ముందు వినిపించాయి. అదే నిజమైతే సీఎం బొమ్మైపై పోటీ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment