బెంగళూరులో ఒక ఫంక్షన్ హాల్లో ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం
బనశంకరి: కాంగ్రెస్ అంటే కుటుంబపాలన, అవినీతి అని ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. ఇప్పటికే కాలం చెల్లిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీకి అర్థం లేదని హేళన చేశారు. రాష్ట్ర విధానసభ ఎన్నికలకు ఇంకా 13 రోజులు సమయం ఉండగా గురువారం రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలతో మోదీ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రసంగిస్తూ కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అవినీతికి గ్యారంటీ అని, ఆ పార్టీకే వారంటీ లేదని చమత్కరించారు.
డబుల్ ఇంజిన్ తప్పనిసరి
రాష్ట్రంలో ఈసారి బీజేపీ ప్రభుత్వాన్ని పూర్తి మెజారిటీతో అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు మోదీ పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజల ఇంటింటికీ చేరవేయాలి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం నష్టపోతుంది. కోవిడ్ సమయంలో నిరుపేదలకు ఉచితంగా రేషన్ అందించాము. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వంలో ఉంటే అభివృద్ధికి దోహదం అవుతుంది. కన్నడనాడు సంస్కృతికి పేరుగాంచింది. కన్నడ భాష సుసంపన్నమైనది మోదీ వర్ణించారు. పోలింగ్‌కు కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండగా, కార్యకర్తలకు ప్రధాని కర్తవ్యబోధ చేశారు. ప్రతి 10 మంది పురుషులు, 10 మంది మహిళా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వారికి బీజేపీ నుంచి ఏమి కోరుకుంటున్నారు, వారి సమస్యలు ఏమిటి ఆలకించాలన్నారు. ఈ భేటీలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల్లో కార్యకర్తలు పాల్గొన్నారు. బెంగళూరులో ఒక స్టార్‌హోటల్లో సీఎం బసవరాజ బొమ్మై, యడియూరప్ప, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ప్రధాని నరేంద్రమోదీ ధ్వజం
నేతలతో, కార్యకర్తలతో
వర్చువల్ సమావేశం
Comments
Please login to add a commentAdd a comment