ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి
బనశంకరి: బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని జయనగర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి తెలిపారు. ఆదివారం జయనగర నియోజకవర్గ పరిధిలోని సారక్కివార్డు, పట్టాభిరామనగర, బైరసంద్రవార్డుల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో సౌమ్యారెడ్డి పాల్గొని మాట్లాడారు. మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని ఈసారి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు మనవి చేశారు.
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి సుస్థిర, సమర్థవంతమైన పాలన కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి గెలిపించాలన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే గృహలక్ష్మీ, గృహజ్యోతి, అన్నభాగ్య, యువనిధి, మహిళా సబలీకరణ తదితర గ్యారంటీ పథకాలు అమల్లోకి తీసుకువస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment