ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక
చింతామణి: మంచి మార్కులు రాలేదని ఆగ్రహించిన ఓ టీచర్ చిన్నారిని బెత్తంతో విచక్షణారహితంగా కొట్టింది. వివరాలు.. పట్టణంలోని ట్యాంక్‌బండ్ ప్రాంతానికి చెందిన దయానంద్ కుమార్తె పట్టణంలోని ప్రీతి పబ్లిక్ పాఠశాలో 4వ తరగతి చదువుతోంది. పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని టీచర్ సింధుశ్రీ ఆ చిన్నారిని బెత్తంతో చితకబాదింది. కాళ్లు, చేతులు వాచిపోయి చిన్నారి ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు ఆరా తీయగా టీచర్ దాష్టీకం వెలుగు చూసింది.
బాలికను ఆస్పత్రికి తరలించిన తండ్రి.. పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఈఓ వెంకటేశ్ నివేదిక ఆధారంగా కాగా సదరు టీచర్‌ను ఆ పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment