మాలూరులో దర్శనం కోసం క్యూలో నిలుచున్న భక్తులు
్డకోలారు: శ్రావణ చివరి శనివారం రోజున నగరంలోని పలు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. నగరంలోని దొడ్డపేటె వెంకటరమణస్వామి ఆలయంలో ఉదయం 6 గంటల నుంచే దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలో నిలబడ్డారు. భజరంగదళ్ కార్యకర్తలు ప్రతియేటా నిర్వహించేలా ఈ సంవత్సరం కూడా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి స్వామి దర్శనం కోసం ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాదం పంచి పెట్టారు. భక్తులకు తీపి పొంగల్, కారా పొంగల్, పులిహోర పంచారు. ఆలయ ప్రాంగణం మొత్తం కేసరిమయమైంది. చివరి శనివారం సందర్భంగా తెల్లవారు జామున 4 గంటల నుంచే ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. స్వామి వారికి ఉదయం క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం అనంతరం వేదమంత్రాల మధ్య విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూలతో స్వామి వారికి అలంకరణ చేశారు. ఎంపీ ఎస్ మునిస్వామి, తదితర ప్రముఖులు ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు.
శ్రీనివాసపురంలో..
శ్రీనివాసపురం: పట్టణంలోని వరదరాజస్వామి ఆలయంలో శనివారం చివరి శ్రావణ శనివారాన్ని పురస్కరించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే స్వామి వారికి అభిషేకం తదితర పూజా విధులు జరిగాయి. స్వామి వారి విగ్రహాన్ని ప్రత్యేక పూలతో అలంకరించారు. భక్తులు ఉదయం 6 గంటల నుంచే పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.
మాలూరులో..
మాలూరు: తాలూకాలోని పురాణ ప్రసిద్ధ చిక్కతిరుపతి శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి శ్రావణ చివరి శనివారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. శ్రావణ శనివారం సందర్భంగా తెల్లవారు జాము నుంచే స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలైన్‌లో నిలుచున్నారు. తెల్లవారు జామున 3 గంటలకు ప్రధాన అర్చకులు రవి, గోపాలకృష్ణ భారధ్వాజ్ నేత్వత్వంలో స్వామి వారికి పూజలు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 8 గంటల వరకు పెద్ద సంఖ్యలో ఆలయానికి భక్తులు తరలి వచ్చారు. స్వామి వారిని ప్రత్యేక పూలతో అలంకరించారు. భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ఎంపీ ఎస్.మునిస్వామితో పాటు పలువురు ప్రముఖులు ఆలయానికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు.
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
ఉదయం 6 గంటలకే బారులు
Comments
Please login to add a commentAdd a comment