కంటోన్మెంట్ రైల్వేస్టేషన్‌లో ఆసనాలు లేక కింద కూర్చొన్న ప్రయాణికులు
సాక్షి బళ్లారి: నగరంలోని కంటోన్మెంట్ రైల్వేస్టేషన్‌లో సమస్యలు తాండవిస్తున్నాయి. నగరంలో ప్రధాన జంక్షన్ రైల్వే స్టేషన్‌తో పాటు కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ కూడా ఉంది. జిల్లాధికారి కార్యాలయం ఎదురుగా ప్రధాన రైల్వే స్టేషన్ ఉండగా, హొసపేటె రోడ్డులో ఉన్న కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ నుంచి కూడా ఇటీవల పలు రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. మరమ్మతు పనుల అంతరాయం వల్ల ప్రధాన రైల్వేస్టేషన్‌కు వెళ్లకుండా పలు రైళ్లు కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ మీదుగానే బెంగళూరు, హొసపేటె, హుబ్లీ తదితర నగరాలకు నేరుగా రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయి. వీటితో పాటు హుబ్లీ మీదుగా బళ్లారి వచ్చే ప్రతి రైలు కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ మీదుగానే రాకపోకలు సాగించడం సర్వసాధారణం. నిత్యం పెద్ద సంఖ్యలో రైళ్ల రాకపోకలు సాగించే ఈ స్టేషన్‌లో దిగేవారు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు రైల్వే ఫ్లాట్‌ఫాం మీద కూర్చోవడానికి ఆసనాలు కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రైల్వే స్టేషన్‌లో మంచినీటి కొళాయిలను ఏర్పాటు చేశారే కానీ అందులో నీరు మాత్రం రాకపోవడంతో ప్రయాణికులు యాతన పడుతున్నారు. ఘన చరిత్ర కలిగిన కంటోన్మెంట్ రైల్వేస్టేషన్‌లో కనీస వసతులు లేకపోవడంతో ప్రయాణికుల పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక నగరంలోని ప్రధాన జంక్షన్ రైల్వే స్టేషన్‌లో కూడా లిఫ్ట్ సమస్య ఉందని నగరవాసి ఎర్రిస్వామి పేర్కొన్నారు. లిఫ్ట్ ఉన్నఫళంగా మధ్యలోనే ఆగిపోతోందని, తాను దాదాపు అర్థగంట పాటు లిఫ్ట్‌లో ఇరుక్కొని ఇబ్బంది పడ్డానని వాపోయారు. ఈనేపథ్యంలో నగర రైల్వేస్టేషన్లలోని సమస్యలపై సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కంటోన్మెంట్‌లో కూర్చోడానికి
ఆసనాలు లేవు
స్టేషన్‌లోని కొళాయిల్లో సరఫరా కాని మంచినీరు
ప్రయాణికుల పాట్లు పట్టించుకోని
అధికారులు
Comments
Please login to add a commentAdd a comment