కంబళ కుల మతాలకు అతీతం
బనశంకరి: కంబళ క్రీడ, కళకు కులం– మతం లేదని ఇది సర్వ ధర్మ క్రీడ అని సీఎం సిద్దరామయ్య అన్నారు. దక్షిణ కన్నడ జిల్లా ఉళ్లాలలో లవ–కుశ జోడుకెరె కంబళ ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. భిన్నత్వంలో ఏకత్వం ఉండే భారత సంస్కృతిలో కరావళి జిల్లాలు ఒక భాగమని అన్నారు. కంబళను సుప్రీంకోర్టు నిషేధించినా మళ్లీ మళ్లీ ప్రారంభించేలా చేసింది తమ ప్రభుత్వమన్నారు. ఈ సందర్భంగా సర్కారు సంక్షేమ పథకాలను ఆయన ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా జాకీలు దున్నపోతులతో బురద మడుల్లో మెరుపు వేగంతో దూసుకుపోయారు. పెద్దసంఖ్యలో జనం ఈలలు, కేకలతో ప్రోత్సహించారు.
సీఎం సిద్దరామయ్య
Comments
Please login to add a commentAdd a comment