శాకంబరీ నమోస్తుతే
బనశంకరి: సిలికాన్‌సిటీలో బనశంకరీదేవి జాతర మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం అర్చకులు అమ్మవారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టి వివిధ పుష్పాలతో అలంకరించారు. పలు రకాల నైవేద్యాలను సమర్పించి పూజ చేశారు. అలాగే శాకంబరీదేవికి వివిధ కూరగాయలతో సుందరంగా అలంకరించారు. నవచండికా హోమం, పూర్ణాహుతి చేపట్టారు. భక్తులకు తీర్ధప్రసాదాలు, అన్నదానం చేశారు.
నేడు బ్రహ్మ రథోత్సవం
పుష్యశుద్ధ పౌర్ణమి సోమవారం మధ్యాహ్నం 12.45 నుంచి 1.30 గంటల మధ్య శుభమేషలగ్నంలో బనశంకరీదేవి బ్రహ్మరథోత్సవం జరుగుతుంది. భారీస్థాయిలో ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment