ఎల్లెడలా సంక్రాంతి శోభ
● సిలికాన్ సిటీలో షాపింగ్ సందడి
బనశంకరి: ఉద్యాన నగరంలో సంక్రాంతి పండుగ కళ నెలకొంది. నగర మార్కెట్లలో పండుగ సరుకుల షాపింగ్ జోరుగా సాగుతోంది. గెణుసు గడ్డలు, వేరుశెనక్కాయలు, రేగిపళ్లు కొనుగోళ్లు చేశారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్బంగా ఇరుగుపొరుగు మహిళలకు పప్పులు, చెరుకు ఇవ్వడం సంప్రదాయం కావడంతో అన్నిచోట్లా అమ్మకాలు జరుగుతున్నాయి. పేరుగాంచిన కేఆర్ మార్కెట్‌లో మహిళలు పూజ సామగ్రి, పప్పులు, బెల్లం కొనుగోలు చేశారు. అన్ని ప్రధాన మార్కెట్లు సందర్శకులతో సందడిగా మారాయి. తమిళనాడు నుంచి భారీఎత్తున కేఆర్ మార్కెట్‌కు చెరుకు మోపులు వచ్చాయి. సోమ, మంగళ, బుధవారం బెంగళూరు నగరంలో సంక్రాంతి పండుగ సందోహం అంబరాన్ని తాకనుంది.
Comments
Please login to add a commentAdd a comment