పోలీసుల దురుసుతనం.. ముగ్గురికి గాయాలు
మండ్య: ట్రాఫిక్ పోలీసుల దురుసు ప్రవర్తన వల్ల ముగ్గురికి రక్త గాయాలయ్యాయి. వాహనాల చెకింగ్ చేస్తుండగా తప్పించుకోవాలని బైకిస్టు బారికేడ్లు దాటి వెళ్తుండగా పోలీసులు చూసి బారికేడ్లను తోయడంతో బైక్‌కు తగిలి ముగ్గురూ కిందపడిపోయారు. ఆదివారం మండ్య నగరంలోని నంద సర్కిల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మండ్య నగరానికి చెందిన అజయ్ (25), తాలూకాలోని హొడాఘట్ట చందన్ (25), హాలహళ్ళి మురికివాడకు చెందిన బతుల్లా (30)కు గాయాలయ్యాయి. దాంతో ప్రజలు పోలీసులపై మండిపడ్డారు. హెల్మెట్ లేకుంటే ఫోటో తీసి జరిమానా వేయాలి తప్ప గాయాలయ్యేలా చేస్తారా? అని ధ్వజమెత్తారు. ఒక వేళ వారు చనిపోయి ఉంటే పరిస్థితి ఏమిటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బాధితులే ఆస్పత్రికి వెళ్లిపోయారు. జిల్లాలో తరచూ పోలీసులు ప్రజల మీద దౌర్జన్యం ప్రవర్తిస్తూ గొడవలకు దిగుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తెలియడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment