ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులు
శ్రీనివాసపురం: శరన్నవరాత్రులలో మహర్నవమి రోజున శ్రీనివాసపురం తాలూకాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసన్ (62) దారుణ హత్యకు గురయ్యాడు. మాజీ స్పీకర్ కెఆర్ రమేష్‌కుమార్ అనుచరుడు, హోం మంత్రి పరమేశ్వర్ ఆప్తుడి శ్రీనివాసన్ కౌన్సిలర్ శ్రీనివాస్‌గా గుర్తింపు పొందాడు. సోమవారం తన తోటలోని ఫాంహౌస్‌లో హత్యకు గురయ్యాడు. శ్రీనివాసపురం సమీపంలోని హొగళగెరె వద్ద హత్య జరిగింది. రక్త గాయాలతో చావుబతుకుల మధ్య ఉన్న శ్రీనివాసన్‌ను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి అక్కడి నుంచి ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక శ్రీనివాసన్ ఆస్పత్రిలో మృతి చెందాడు.
ప్రత్యక్ష సాక్షి కథనం: ఘటనను ప్రత్యక్షంగా చూసిన అమర్ అనే వ్యక్తి కథనం మేరకు ...నూతనంగా నిర్మిస్తున్న బార్ నిర్మాణ పనులను వీక్షించి తిరిగి తోటలోని ఇంటికి వచ్చామని, ఈ సమయంలో రెండు ద్విచక్ర వాహనాలలో తోటలోకి వచ్చిన దుండుగులు అంకుల్ బాగున్నారా అని పలకరించి షేక్‌హాండ్ ఇచ్చే నెపంతో ముందుకు వచ్చి మారణాయుధాలతో శ్రీనివాసన్‌ను నరికి చంపారని తెలిపాడు. దుండుగులు ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు చూశానని తెలిపారు.
రమేష్ కుమార్, హోం మంత్రి పరమేశ్వర్ పరామర్శ :
హత్య విషయం తెలిసిన వెంటనే హోం మంత్రి పరమేశ్వర్, మాజీ స్పీకర్ రమేష్‌కుమార్ ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రికి వెళ్లి శ్రీనివాసన్ భౌతిక కాయాన్ని సందర్శించారు. రమేష్ కుమార్ కన్నీరు పెట్టుకున్నారు. శ్రీనివాస్ హంతకులను వెంటనే పట్టుకుంటామని పరమేశ్వర్ తెలిపారు.
పోలీసులపై ఎదురుదాడి, నిందితులపై కాల్పులు
శ్రీనివాసన్ హత్య అనంతరం హంతకులు ఆరుగురు లక్ష్మీ సాగర అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారు. నిందితులను పట్టుకోవడం కోసం మూడు ప్రత్యేక బృందాలను ఎస్పీ నారాయణ్ రంగంలోకి దింపి 24 గంటల్లోపు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వేమగల్ సీఐ వెంకటేష్ నేతృత్వంలోని ఓ బృందం లక్ష్మీ సాగర అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. తారసపడిన హంతకులు పట్టుకోవడానికి యత్నించగా వారు పోలీసులపై దాడి చేశారు. దీంతో సీఐ కాల్పులు జరిపారు. నిందితులు మునీంద్ర, సంతోష్, వేణుగోపాల్‌కు గాయాలయ్యాయి. నిందితుల దాడిలో పోలీసులు ముంజునాథ్, నాగేశ్‌లు కూడా గాయపడ్డారు. అందరినీ ఎస్‌ఎన్‌ఆర్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రాజకీయ, ఆస్తి తగాదాలే కారణమా ? హతుడు శ్రీనివాసన్, వేణుల మధ్య ఏడేళ్లుగా రాజకీయ వైరంతో పాటు భూ వివాదాలు కూడా ఉన్నట్లు సమాచార. ఈ నేపథ్యంలోనే హత్య జరిగిందని భావిస్తున్నారు.
మారణాయుధాలతో నరికి చంపిన దుండగులు
అరెస్టు సమయంలో నిందితుల దాడి, పోలీసుల ఎదురు కాల్పులు
పోలీసు కాల్పుల్లో గాయపడిన నిందితులు
Comments
Please login to add a commentAdd a comment