తల భాగం లేని జిరాఫీ ప్రతిమ
సాక్షి బళ్లారి: బళ్లారి నగరంలోని జిల్లా క్రీడా మైదానం పక్కనే అద్భుతంగా నిర్మించిన విజ్ఞాన కేంద్రానికి తగినంత నిధులు లేకపోవడంతో అధ్వానంగా మారింది. పాఠశాల, కాలేజీ విద్యార్థుల, ప్రజలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని తెలియజేసే ఉప విజ్ఞాన కేంద్రం రోజు రోజుకు నిర్వహణ లోపంతో అధ్వానంగా మారడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014లో 11 ఎకరాల్లో విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ 8 మంది సిబ్బందిని నియమించినప్పటికీ అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులే. విజ్ఞానం కేంద్రంలోకి అడుగుపెడుతున్న వెంటనే మన సంస్కృతి, వారసత్వాలు ప్రతిబింబించడంతో పాటు పురాతన కాలంనాటి ఆదిమానవుల జీవన విధానం, దశల వారీగా మనిషి రూపాంతరం, ఆహార పద్దతులు తదితర జ్ఞానాన్ని పెంపొందించే విధంగా విజ్ఞాన కేంద్రంలో ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు. ఇక ఆవరణంలో ఆదిమానవుడు నుంచి నేటి వరకు మనిషి దశల వారిగా ఏవిధంగా అభివృద్ధి చెందారన్నది అద్భుతంగా చిత్రాల ద్వారా విద్యార్థులకు అవగతమయ్యే విధంగా ఏర్పాటు చేశారు. ప్రతి రోజు బళ్లారి నగరం నుంచే కాకుండా ఇతర జిల్లాలు, తాలూకాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులతో పాటు జనం వచ్చి వెళ్తుంటారు. విజ్ఞాన కేంద్ర ఆవరణంలో విద్యార్థులకు వినోదంతో పాటు జంతువుల గురించి తెలుసుకునేందుకు పులి, సింహం, ఏనుగు, జిరాఫీ తదితర జంతువులు జూలో ఉన్న తరహాలోనే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయా జంతువులకు సంబంధించిన వాటిని నిర్వహణ లేకపోవడంతో పలు జంతువుల బొమ్మలు దెబ్బతిన్నాయి. గాలికి, ఎండకు, వానకు వాటి రంగులు కూడా మారిపోయాయి. సైన్స్ కేంద్రంలో ఏర్పాటు చేసిన జంతువులకు సంబంధించి ప్రతిమలు ధ్వంసం కావడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ప్రభుత్వం నుంచి తక్కువ నిధులు విడుదల కావడంతోనే నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. రూ.70 లక్షలు నిధులు మాత్ర మే విడుదలయ్యాయి. ఇందులో సిబ్బంది జీతాలతో పాటు తదితర ఖర్చులకు కూడా వీటి పరిధిలోకే వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజ్ఞా న కేంద్రంలో నిధుల కొరతతో జంతువుల ప్రతిమలు పాడుబడి ఆధ్వానంగా మారడంతో విజ్ఞాన కేంద్రం అవిజ్ఞాన కేంద్రంగా మారిందని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని విజ్ఞాన కేంద్రాన్ని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
విజ్ఞాన కేంద్రాన్ని పట్టించుకోని
అధికారులు, పాలకులు
పర్యవేక్షణ లేక తుప్పుపట్టిన
జంతువుల బొమ్మలు
Comments
Please login to add a commentAdd a comment