శబరీష్ (ఫైల్)
మైసురు: జిమ్ ట్రైనర్ ఒకరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైసూరు జిల్లాలోని నంజనగూడు పట్టణంలోని సిద్దేగౌడ లేఔట్‌లో జరిగింది. శబరీష్ (30) బాడీ బిల్డర్ మాత్రమే కాకుండా జిమ్ ట్రైనర్‌గా స్థానికంగా పేరు పొందాడు. అయితే బుధవారం సాయంత్రం ఇంటిలో ఎవరూ లేని సమయంలో శబరీష్ ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానిక పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక సమస్యలే కారణం కావచ్చని అనుమానాలున్నాయి.
గజరాజు అర్జున్ మృతిపై విచారణ
యశవంతపుర: ఇటీవల హాసన్ జిల్లాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన మైసూరు దసరా ఏనుగు అర్జున్ కేసులో విశ్రాంత అటవీశాఖ అధికారి అజయ్ మిశ్రా బృందం విచారణను ప్రారంభించింది. బెంగళూరు నుంచి హాసన్‌కు చేరుకొంది. ఈ నెల 4న సకలేశపుర తాలూకా యసళూరు విభాగం దుబ్బళ్లికట్ట వద్ద అడవి ఏనుగును పట్టుకొనే ప్రయత్నంలో ఉండగా, అటవీ సిబ్బంది కాల్పులు జరిపారు. పొరపాటున అర్జున్ కాలికి తూటా తగిలి ప్రాణాలు కోల్పోయింది. దీనిపై పలు జిల్లాల్లో అర్జున్ అభిమానులు ధర్నాలు కూడా నిర్వహించి అటవీ శాఖపై అనుమానాలను వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment