క్రీడా జ్యోతిని అందిస్తున్న దృశ్యం
కేజీఎఫ్: క్రీడలతో ఉత్తమ ఆరోగ్యం, సదృఢ శరీరాకృతి పొందవచ్చని బెంగళూరు ఉత్తర వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. బుధవారం బెమెల్ క్రీడా మైదానంలో భగవాన్ మహావీర్ జైన్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థి జీవితంలో అవిభాజ్య అంగమైన క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ప్రతి విద్యార్థి తప్పకుండా క్రీడా పోటీల్లో పాల్గొనాలన్నారు. అప్పుడే ఉత్తమ మానసిక శారీరక పరిణతి సాధించవచ్చన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సామాన్యమని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మెలగాలన్నారు. తాను అనేక సార్లు ఓటమి పాలైనా చివరికి ఉన్నత స్థానానికి చేరుకున్నానన్నారు. బెంగళూరు ఉత్తర వర్సిటీ కింద 299 కళాశాలలుండగా లక్షకు పైగా విద్యార్థులు ఉన్నారన్నారు. జైన్ కళాశాల ప్రిన్పిపాల్ డాక్టర్ రేఖాసేథి, కళాశాల మేనేజింగ్ ట్రస్టి మహేంద్ర మునోత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment