కాలువ ఆధునీకరణలో గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

కాలువ ఆధునీకరణలో గోల్‌మాల్‌

Published Sun, Jan 21 2024 12:16 AM | Last Updated on Sun, Jan 21 2024 12:16 AM

కాలువకు చేపట్టిన నాసిరకం పనులు(పైల్‌)  - Sakshi

రాయచూరు రూరల్‌: తుంగభద్ర ఎడమ కాలువ ఆధునీకరణ పనుల్లో రూ.650 కోట్ల నిధులు స్వాహా కావడంతో 28 మంది ఇంజినీర్లను సస్పెండ్‌ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన గత బీజేపీ సర్కార్‌లో కర్ణాటక నీటిపారుదల మండలి కాలువ మరమ్మతులకు సంబంధించి నిధులు విడుదల చేసిన తర్వాత పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. 2009–10, 2010–11ల్లో 13 పనుల్లో రూ.650 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు విచారణలో బయట పడింది. ఈ విషయంలో నీటిపారుదల శాఖ ప్రభుత్వ ఆధీన కార్యదర్శి ఎన్‌.హర్ష చర్యలకు ఆదేశించారు. రాయచూరు, కొప్పళ జిల్లాల్లో రైతుల జీవనాడిగా ఉన్న తుంగభద్ర ఎడమ కాలువ ఆధునీకరణ పేరుతో రూ.కోట్లాది నిధులను దిగమింగారు. 13 పనులకు నకిలీ బిల్లులు సృష్టించి నిధులు వాడుకున్న అంశంపై 28 మంది ఇంజినీర్లు, సిబ్బంది బాధ్యులంటూ వారిని వెంటనే సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ కేసు దాఖలు చేయాలని ఆదేశించారు. 90 శాతం కాలువ పనులను 39 రోజుల్లో ముగించడం కష్టసాధ్యమనే విషయం విచారణలో తేలింది. పదవీ విరమణ చేసిన చీఫ్‌ ఇంజినీర్‌ ఎన్‌.వెంకటేశయ్య అభిప్రాయం మేరకు ఉన్న పనులు చేపట్టకుండా, అనవసరంగా పనులు చేసినట్లు బోగస్‌ బిల్లులు చూపడాన్ని నివేదికలో వివరించారు. మట్టి పనులకు నకిలీ బిల్లులు పెట్టారన్నారు. గతంలో నీటిపారుదల ఽశాఖా మంత్రిగా బసవరాజ్‌ బొమ్మై ఉన్న సమయంలో ఈ అక్రమాలు జరిగాయని తెలిపారు.

28 మంది బాధ్యుల సస్పెండ్‌కు ఆదేశాలు

తుంగభద్ర ఎడమ కాలువ ఆధునీకరణలో రూ.650 కోట్ల నిధుల దుర్వినియోగంలో 28 మంది ఇంజినీర్ల సస్పెండ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏఈఈలు అనంత్‌ కుమార్‌ చూరి, హన్మంతప్ప, తిమ్మణ్ణ, జేఈలు ఈశ్వర్‌ నాయక్‌, వినోద్‌ కుమార్‌ గుప్త, శివమూర్తి, సూగప్ప, శాంతరాజ్‌, బసవరాజ్‌ హళ్లి, వెంకటేశ్వరరావు, జితేంద్ర, రాజీవ్‌ నాయక్‌, విశ్వనాథ్‌, కృష్ణమూర్తి, దేవేంద్రప్ప, యల్లప్ప, రవి, జగన్నాథ్‌ కులకర్ణి, అబ్దుల్‌ రషీద్‌ ఖాన్‌, గజానన, మోహన్‌ కుమార్‌, హెచ్‌.డీ.నాయక్‌, మల్లప్ప నాగప్ప, మహమూద్‌, క్లర్క్‌లు నాగరాజ్‌, ఆరిఫ్‌ హుసేన్‌, అబ్దుల్‌ హక్‌, అనురేఖలున్నారు.

విచారణలో బయట పడిన అక్రమాలు

పనుల పేరుతో రూ.650 కోట్లు హాంఫట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement