ఎంపీ టికెట్‌ ఇప్పిస్తామని రూ.2 కోట్లు వంచన | - | Sakshi
Sakshi News home page

ఎంపీ టికెట్‌ ఇప్పిస్తామని రూ.2 కోట్లు వంచన

Published Sat, Oct 19 2024 12:38 AM | Last Updated on Sat, Oct 19 2024 12:38 AM

-

బొమ్మనహళ్లి: గత ఎంపీ ఎన్నికల సమయంలో టికెట్‌ ఇప్పిస్తామని చెప్పి జేడీఎస్‌ మాజీ ఎమ్మెల్యే వద్ద నుంచి రూ. 2 కోట్లు తీసుకొని వంచనకు పాల్పడినట్లు ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి సోదరుడు గోపాల్‌జోషి, అతని కుమారుడు అజయ్‌జోషిపై బసవేశ్వర పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. బెంగళూరు సిటీ పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌ శుక్రవారం విలేకరులకు తెలిపారు. విజయపుర నాగఠాణా నియోజకవర్గ జేడీఎస్‌ మాజీ ఎమ్మెల్యే దేవానంద్‌ పుల్‌ సింగ్‌ చౌహాన్‌ భార్య సునీత చౌహాన్‌ ఫిర్యాదుతో ఈకేసు నమోదైంది. కులం పేరుతో దూషించినట్లుగా కూడా వారిప కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదులో వివరాలు..ఎంపీ టికెట్‌ కోసం గోపాల్‌ జోషి తొలుత రూ.5 కోట్లు డిమాండ్‌ చేయగా దేవానంద్‌ అంగీకరించలేదు. ఆ తర్వాత రూ. 25 లక్షల నగదు, రూ.5 కోట్లు బసవేశ్వరనగరలో ఉన్న గోపాల్‌ సోదరి విజయలక్ష్మికి చెక్‌ రూపంలో ఇచ్చారు. టికెట్‌ రాకపోవడంతో చెక్‌ వాపస్‌ ఇచ్చి రూ.25 లక్షలు వెనక్కు ఇవ్వలేదు. ప్రాజెక్టు బిల్లు రాలేదని, రూ.1.75 కోట్లు ఇస్తే బిల్లు వచ్చిన వెంటనే మొత్తం రూ.2 కోట్లు వాపసు ఇస్తానని గోపాల్‌జోషి చెప్పాడు. దీంతో దేవానంద్‌ తన బంధువుల వద్ద నుంచి డబ్బు సమకూర్చుకొని ఇచ్చాడు. ఇందుకు గోపాల్‌జోషి కుమారుడు అజయ్‌జోషి ష్యూరిటీ ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత డబ్బు అడిగితే చేతులెత్తేశారు. గట్టిగా అడిగితే గూండాలను బెదిరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement