వీడియోలో గోడు వెళ్లబోసుకుంటున్న యువకులు
బనశంకరి: కలబుర్గికి చెందిన యువకులను దళారులు మభ్యపెట్టి రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూపులో కిరాయి సైనికులుగా పంపించారు. వారు ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయి సాయం కోసం కుటుంబాలకు ఫోన్లు చేశారు. జిల్లాకు చెందిన మంత్రి ప్రియాంక్‌ఖర్గే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, అమాయకులను తీసుకెళ్లి బలవంతంగా చేర్చారని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్‌చేసి విదేశాంగ మంత్రితో మాట్లాడాలని చెప్పానన్నారు.
గత డిసెంబరులో పయనం
కలబుర్గికి చెందిన ముగ్గురు యువకులు సయ్యద్ ఇలియాస్ హుస్సేనీ, సమీర్ అహ్మద్, సకై న్ మహమ్మద్ అనేవారికి సోషల్ మీడియాలో ముంబైకి చెందిన బాబా అనే వ్యక్తి పరిచయమయ్యాడు. రష్యాలో మంచి ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించాడు. డిసెంబరు చివరి వారంలో ముగ్గురినీ రష్యాకు పంపించాడు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలని శిక్షణనిచ్చి ఉక్రెయిన్‌లో యుద్ధానికి పంపారు. అక్కడ అష్టకష్టాలు పడుతున్నామని, తమను కాపాడాలని యువకులు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. తమ పిల్లలను కాపాడాలని యువకుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కిరాయి సైనికులుగా కలబుర్గివాసులు
Comments
Please login to add a commentAdd a comment