అన్నదానం
సాక్షి, బళ్లారి: రాజ్యోత్సవ వేడుక సందర్భంగా జిల్లా జనజాగృతి సంఘం, జిల్లా ఆటో డ్రైవర్ల అసోషియేషన్ అధ్యక్షుడు హుండేకర్ రాజేష్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. శుక్రవారం నగరంలోని బీకేఎస్ ఆస్పత్రి ఎదురుగా కన్నడ మాత భువనేశ్వరి విగ్రహానికి పూజలు నిర్వహించారు. చైతన్య కాలేజీ, పాత బస్టాండు, బళ్లారి హృదయాలయ ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో అన్నదానం, రాజ్యోత్సవ సంబరాలు జరిపారు. బీజేపీ నాయకులు, నగర ప్రముఖ వైద్యులు బీకే.సుందర్, బీకే.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆ సీఈఓను కోర్టుకీడుస్తాం
హుబ్లీ: హావేరి జిల్లా సవణూరు తాలూకా కడకోళలో జరిగిన ఘర్షణకు సంబంధించి 30 మందిపై కేసు నమోదు చేశారు. దీనికి హావేరి జెడ్పీ సీఈఓ లోపమే కారణమని, ఆ సీఈఓను కోర్టుకీడుస్తామని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి తెలిపారు. స్థానిక మీడియాతో మాట్లాడిన ఆయన హావేరిలోని హనుమాన్ దేవస్థానం స్వాధీనం చేసుకొనే క్రమంలో ఘర్షణ జరిగింది. సీఎం సిద్దరామయ్యను ఆయన దీని కన్నా ఇంకా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలు ఆందోళన చేపట్టారన్నారు. అయితే సిద్దరామయ్య మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణించడం లేదన్నారు. ఎందుకంటే ఆయనకు అధికారం నుంచి వైదొలుగుతానన్న విషయం తెలిసి పోయిందన్నారు.
నేటి నుంచి భగవాన్
మహావీర నిర్వహణ పూజలు
హుబ్లీ: జైన పరంపర 24వ తీర్థంకరులు, అహింస ప్రతిపాదకులు భగవాన్ మహావీరుడు మోక్షం పొంది ఈ దీపావళి అమావాస్యకు 2550 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా శనివారం నుంచి దీపావళి పాడ్యమి నూతన మహావీరులు శకం 2551 ప్రారంభం అవుతుందని నిజంబర జైన సమాజం పాలక మండలి ప్రముఖులు శాంతినాథ కే పోతపేట తెలిపారు. అమావాస్య ప్రభాత సమయంలో ప్రపంచ సంస్థ జైన బాంధవులు మహావీరులు నిర్వహణ పూజలను అత్యంత శ్రద్ధతో నెరవేరుస్తారన్నారు. జైన బాంధవులు తమ అన్ని శుభకార్యాలు, ధార్మిక పూజలలో మహావీరుల శకాన్ని నమోదు చేసే సాంప్రదాయం ఉందన్నారు. వర్థమానంలో ప్రముఖ శకాలలో అత్యంత ప్రాచీన శకం మొదలవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment