రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకకు ప్రత్యేకంగా అభివృద్ధి పథకం చేపడతామని రాష్ట్ర వైద్యవిద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం క్రీడాంగణంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండెపోటు కేసులు అధికమవుతున్న సందర్భంగా ప్రాంతీయ కేంద్రాల్లో నూతనంగా జయదేవ్ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బెంగళూరులో ఇప్పటికే ఉందని, త్వరలో కలబుర్గిలో ప్రారంభమైతే రాయచూరు, యాదగిరి, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలకు అనుకూలమవుతుందన్నారు. హుబ్లీ, మైసూరుల్లో జయదేవ అస్పత్రులను నెలకొల్పుతున్నట్లు వివరించారు. రాయచూరులో విమానాశ్రయం పనులు చేపడతామన్నారు. ఎయిమ్స్ మంజూరు రాయచూరుకే అన్నారు. రాయచూరులో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. రాయచూరు, బళ్లారి జిలాల్లో మానవ తల్లి పాల కేంద్రాలు, రాయచూరులో ప్రైవేట్ భాగస్వామ్యంతో స్పిన్నింగ్ మిల్లు ప్రారంభిస్తామన్నారు. రాయచూరులో రూ.40 కోట్లతో, ఐదు చోట్ల రూ.50 కోట్లతో కోల్డ్‌స్టోరేజీలను, రాయచూరులో రూ.25 కోట్లతో మిరప మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment