రాయచూరు రూరల్: కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కర్ణాటక రక్షణా వేదిక, ప్రముఖులు, కార్యకర్తలు నేతాజీ నగర్ సర్కిల్లో ధ్వజారోహణ గావించారు. నగరసభ ఉపాధ్యక్షుడు సాజిద్, రవికుమార్‌లు భువనేశ్వరి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. నగరంలో నేతాజీ నగర్లో కన్నడ కలా యువ వేదిక ఆధ్వర్యంలో సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యులు కన్నడ ధ్వజాన్ని ఎగురవేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నగరంలోని కర్ణాటక సంఘ్ నుంచి భువనేశ్వరి చిత్రపటాన్ని పురవీధుల గుండా ఊరేగించారు.
ధ్వజారోహణ చేస్తున్న స్వామీజీ తదితరులు
భువనేశ్వరి విగ్రహాన్ని ఊరేగిస్తున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment