హెల్మెట్‌ ధారణ.. ప్రాణానికి రక్షణ | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ ధారణ.. ప్రాణానికి రక్షణ

Published Sat, Nov 2 2024 12:52 AM | Last Updated on Sat, Nov 2 2024 12:52 AM

హెల్మ

హెల్మెట్‌ ధారణ.. ప్రాణానికి రక్షణ

రాయచూరు రూరల్‌: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతిఒక్కరూ హెల్మెట్‌ ధరించాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖామంత్రి శరణ ప్రకాష్‌ పాటిల్‌ సూచించారు. శుక్రవారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద కబీర్‌ జ్ఞాపకార్థం హెల్మెట్లు పంపిణీ చేసి మాట్లాడారు. ట్రాఫిక్‌ పోలీసులు వాహన యజానులకు ప్రచారం చేసి వారిని జాగృతం చేయాలన్నారు. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనాదారులు తప్పకుండా హెల్మెట్లు ధరించాలని ప్రచారం చేపట్టారన్నారు. ఆటో డ్రైవర్లకు లైసెన్సు, వాహనాల ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్సు, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌, నంబర్‌ ప్లేట్లు, హెడ్‌లైట్ల అమరిక, సౌండ్‌ ఇతరత్ర సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకొని ట్రాఫిక్‌ పోలీసులు అడిగినప్పుడు చూపించాలన్నారు. ఎమ్మెల్యే బసనగౌడ, ఎమ్మెల్సీ వసంత కుమార్‌, ్‌జిల్లాధికారి నితీష్‌, ఎస్పీ పుట్టమాదయ్య, జెడ్పీ సీఈఓ రాహుల్‌ తుకారాం పాండే, మారుతి, సాదిక్‌, అస్లాం పాషాలున్నారు.

బిమ్స్‌లో శిశువుల మృతి ఆందోళనకరం

హుబ్లీ: బెళగావి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(బిమ్స్‌) ఆస్పత్రిలో గత 3 నెలల నుంచి 41 మంది శిశువులు మృతి చెందడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందని, ఈ విషయాన్ని సదరు ఆస్పత్రి పాలక మండలి అంగీకరించిందని బెళగావి ఎంపీ జగదీశ్‌ శెట్టర్‌ పేర్కొన్నారు. బెళగావిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సదరు ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లనే శిశువుల మరణం జరిగిందని, అధికారులు చట్టరీత్య చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యులకు శిక్షలు పడేలా చూడాలన్నారు. ఇలాంటి ఘటనలు తలెత్తకుండా ఆస్పత్రిలో అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులలో నాణ్యమైన చికిత్స అందించడానికి పలు సౌకర్యాల కొరత ఉందన్నారు. రాష్ట్రంలో కొత్త ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. అయినా అక్కడ ఎక్కువగా సౌకర్యాలు లేక కనీస వసతులు కూడా కరువయ్యాయన్నారు. ఆస్పత్రుల్లో వైద్యుల నియమాకం తగినంతగా జరగడం లేదన్నారు. కావాల్సిన యంత్ర పరికరాలు, మౌలిక సదుపాయాలు లభించడం లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో మంచి కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉత్తమ పాలన ఉంటే మాత్రమే రాష్ట్రంలో మంచి పరిణామాలు ఉంటాయని ఆయన వివరించారు.

ఇందిరా, పటేల్‌లకు

పుష్పాంజలి

రాయచూరు రూరల్‌ : దేశానికి స్వాతంత్య్రం కోసం అహర్నిశలు శ్రమించిన మహానుభావుడు, ఉక్కు మనిషిగా పేరొందిన వ్యక్తి సర్దార్‌ వల్లబాయి పటేల్‌ అని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసంత్‌ కుమార్‌, నగరాధ్యక్షుడు బసవరాజరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి సర్దార్‌ వల్లబాయి పటేల్‌ జయంతి, ఏకతా దివస్‌, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి మాట్లాడారు. వెనుక బడిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డ ఆదర్శ వ్యక్తి అన్నారు. జాతీయ స్థాయిలో ఇరువురు సామాన్య ప్రజల బాధలను పరిష్కరించేందుకు వారు చేసిన పథకాలు కీర్తిని సంపాదించాయన్నారు. వారి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. సమావేశంలో సుకాణి, బసవరాజ్‌ పాటిల్‌, శశికళ, శాంతప్ప, అమరేగౌడ, మంజులలున్నారు.

జాతీయ ఐక్యతా దినోత్సవం

హొసపేటె: జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఐక్యత జాతాను అదనపు ఎస్పీ సలీం పాషా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. చెల్లాచెదురుగా ఉన్న రాష్ట్రాలను, భారతదేశాన్ని ఏకతాటి పైకి తెచ్చిన ఘనత వల్లభాయి పటేల్‌కే దక్కుతుంది. ఆ సమయంలో సర్దార్‌ వల్లబాయి పటేల్‌ గట్టి నిర్ణయం తీసుకున్నారు. అతని పుట్టిన రోజును నేషనల్‌ యూనిట్‌ డేగా ప్రకటించారని అందుకే ఏక్తా ఓట వేడుక జరుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం పరుగును టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ప్రారంభించి పునీత్‌ కుమార్‌ సర్కిల్‌, కాలేజ్‌ రోడ్డుతో పాటు నగరంలోని పలు ప్రాంతాల గుండా నిర్వహించి డీఎస్పీ కార్యాలయం వరకు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ మంజునాథ్‌ తల్వార్‌, పీఐలు లఖన్‌ ఆర్‌.శశికుమార్‌, పీఎస్‌ఐ సంతోష్‌ దుబ్బిన్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
హెల్మెట్‌ ధారణ..  ప్రాణానికి రక్షణ  1
1/2

హెల్మెట్‌ ధారణ.. ప్రాణానికి రక్షణ

హెల్మెట్‌ ధారణ..  ప్రాణానికి రక్షణ  2
2/2

హెల్మెట్‌ ధారణ.. ప్రాణానికి రక్షణ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement