ముడా ప్లాట్లు.. అన్నీ లోటుపాట్లు
మైసూరు: మైసూరు నగరాభివృద్ధి ప్రాఽధికార (ముడా)లో జరిగిన 50: 50 నిష్పత్తిలో పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇందులో అంతులేని అక్రమాలు బయటపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 50: 50 నిష్పత్తిలో ఎన్ని ఇళ్ల స్థలాలను, ఎంతమందికి ఇచ్చారు, వాటి విలువ ఎంత అనేది అంచనా వేస్తున్నారు. ఇప్పటికి 211 ప్లాట్ల వివరాలను బయటకుతీశారు. ఫిఫ్టీ నిష్పత్తిలో 241 ప్లాట్లను మంజూరు చేశారని, ఇందులో 211 ప్లాట్ల వివరాలు లభ్యం కాగా, మిగతా వాటి సమాచారం లేదని ముడా అధికారులు తెలిపారు. ఇందులో అబ్దుల్‌వాజిద్ అనే వ్యక్తి ఏకంగా 26 ప్లాట్లను తీసుకున్నాడు. 2020 నుంచి 2023 వరకు అప్పటి కమిషనర్ల నిర్ణయం ప్రకారం స్థలాల పంపిణీ జరిగింది. అత్యధికంగా సయ్యద్ యూసఫ్ 21 స్థలాలు, మల్లప్ప– 19, వెంకటప్ప 17, దేవమ్మ 16 స్థలాలను తీసుకున్నారు. సీఎం భార్య పార్వతికి 14 స్థలాలను ఇవ్వడం పెద్ద స్కాంగా మారడం తెలిసిందే. వీరందరూ ముడాకు భూములు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఆ ప్లాట్లను పొందినట్లు చెబుతున్నారు. ఇంకా అనేకమందికి 5, 6 చొప్పున ప్లాట్లను కేటాయించారు. వీరందరికీ అర్హత ఉందా, లేదా అనేది తేలాల్సి ఉంది.
మంత్రి జమీర్‌పై చర్యలకు గవర్నర్ సూచన
శివాజీనగర: మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ సూచించారు. ముడా కేసులో సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూట్ చేయవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి జమీర్ అహమ్మద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం.. రాజ్‌భవన్‌కు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందున ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌కు గవర్నర్ ఆదేశించారు.
ఒక్కొక్కరికి 15, 20 స్థలాల మంజూరు
30 ప్లాట్ల సమాచారం లేదు
Comments
Please login to add a commentAdd a comment