పరమశివా పాహిమాం
ఆలయాల్లో సందడి
నగరంలోని శైవ ఆలయాలు భక్తజనంతో పోటెత్తాయి. గవి గంగాధరేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు.
బనశంకరి: కార్తీక మాసం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం (ఓంకార ఆశ్రమం)లో విశేష పూజలు జరిగాయి. ఉత్తరహళ్లి– కెంగేరి ప్రధాన రహదారిలోని శ్రీనివాసపురలో వెలసిన ఆలయంలో జ్యోతిర్లింగాలకు రుద్రాక్షలతో అలంకరించారు. పీఠాధ్యక్షుడు మధుసూదనానంద పురి స్వామి జ్యోతిర్లింగాలకు పూజలు, మహామంగళహారతి చేపట్టారు. పెద్దసంఖ్యలో భక్తులు దర్శనాలు చేసుకున్నారు.
శైవ ఆలయాల్లో కార్తీక పూజలు
Comments
Please login to add a commentAdd a comment