అనర్హుల రేషన్ కార్డుల్ని తొలగిస్తాం
బనశంకరి: రాష్ట్రంలో అనర్హులకు ఉన్న రేషన్ (బీపీఎల్) కార్డులను మాత్రమే రద్దుచేస్తామని, అర్హులు, నిరుపేదల కార్డులను ముట్టుకోబోమని సీఎం సిద్దరామయ్య చెప్పారు. సోమవారం కనకదాస జయంతి సందర్భంగా నగరంలో శాసకర భవన్‌లో కనకదాసు విగ్రహానికి నివాళులర్పించి విలేకరులతో మాట్లాడారు. బీపీఎల్ కార్డులను రద్దుచేస్తున్నారని బీజేపీ, జేడీఎస్ ఆరోపించడాన్ని ప్రస్తావిస్తూ, నిరుపేదల రేషన్‌కార్డులను రద్దు చేసేది లేదన్నారు. మళ్లీ చెబుతున్నాను.. అనర్హుల కార్డులను మాత్రమే ఏరివేస్తామన్నారు. కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తుంటే బీజేపీ, జేడీఎస్ ఏం చేస్తున్నాయి?, రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.4.50 లక్షల కోట్లు పన్నులు కడుతున్నామని, మనకు వెనక్కి వస్తున్నది రూ.59 వేల కోట్లు మాత్రమే అని ఆరోపించారు. కర్ణాటకకు ఇంత జరుగుతున్నా మాజీ ప్రధాని దేవేగౌడ, హెచ్‌డీ కుమారస్వామి కేంద్రాన్ని ప్రశ్నించారా, ప్రధాని మోదీ అన్యాయం చేసినా పట్టించుకోరా అన్నారు. రాష్ట్రానికి ఇచ్చే నబార్డు నిధులు, రైతులకు సహాయాన్ని నిలిపేశారని ధ్వజమెత్తారు. గ్యారంటీలపై విమర్శలు చేసిన ఆరోపణలు చేసిన మహారాష్ట్ర సర్కారుపై కేసు వేస్తామన్నారు.
ఏరివేత తప్పదు: హోం మంత్రి
మైసూరు: బీపీఎల్ కార్డుల సవరణను హోం మంత్రి పరమేశ్వర్ మైసూరులో సమర్థించారు. గ్యారంటీ పథకాలకు– బీపీఎల్ కార్డుల సవరణకు సంబంధం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, కారు కలిగిన వారు, పన్ను చెల్లింపుదారులు, కనీసం మూడు హెక్టార్ల భూమిని కలిగిన వారు కూడా బీపీఎల్ కార్డును ఉపయోగిస్తున్నారన్నారు. అలాంటి వారు కార్డులను వాపసు చేయాల్సిందేనని చెప్పారు.
పేదల జోలికెళ్లం: సీఎం సిద్దు
Comments
Please login to add a commentAdd a comment