ప్రైవేటు బస్సు బోల్తా
● 30 మందికి గాయాలు
తుమకూరు: అతివేగం, అజాగ్రత్తగా నడపడంతో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. జిల్లాలోని శిరా తాలూకా హెగ్గనహళ్లి వద్ద జాతీయ రహదారి–48లో సోమవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. వివరాలు.. బళ్లారి నుంచి బెంగళూరు వైపు వెళుతుండగా ప్రైవేట్ బస్సు మార్గమధ్యంలో ప ల్టీలు కొట్టింది. రోడ్డుపైనే బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో మరో ప్రమాదం తప్పింది. గాయపడిన ప్రయాణికుల్లో 15–20 మందిని శిరా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనపై కళ్లంబెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని గంటలపాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment