డైరెక్టర్‌పై టీవీ నటుడు ఫైర్
బనశంకరి: సినిమా షూటింగ్‌ను సగంలో నిలిపివేయడంతో కోపోద్రిక్తుడైన నటుడు.. డైరెక్టర్ పై కాల్పులు జరిపాడు. సినిమాలో మాదిరి ఈ సంఘటన నగరంలో జరిగింది. నిందితుడు, టీవీ నటుడు తాండవేశ్వర్ అలియాస్ తాండవ రాం ను మంగళవారం బెంగళూరు చంద్రా లేఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మాట్లాడదామని వచ్చి..
నటుడు తాండవేశ్వర్.. జోడిహక్కి, భూమికి బంద భగవంత అనే సీరియల్లో నటించాడు. హాసన జిల్లా స్వస్థలం. కన్నడ సినిమా డైరెక్టర్ భరత్ తో పరిచయమైంది. దేవనామ్ ప్రియ అనే సినిమా దర్శకత్వంపై చర్చలు జరిపారు. నిర్మాత దొరక్కపోవడంతో తాండవేశ్వర్ నిర్మాణ వ్యయం భరిస్తానని దశలవారీగా డైరెక్టర్ భరత్ కు రూ.6 లక్షలు ముట్టజెప్పాడు. సినిమా షూటింగ్ ప్రారంభమై రెండేళ్లు గడిచిప్పటికీ పూర్తి కాలేదు. దీంతో తానిచ్చిన డబ్బును వెనక్కి ఇవ్వాలని తాండవేశ్వర్ అడిగాడు. చంద్రా లేఔట్ ఠాణా పరిధిలోని బసవేశ్వర లేఔట్లో భరత్ ఆఫీసులో సోమవారం సాయంత్రం 6.30 సమయంలో దీనిపై మాట్లాడసాగారు. వారి వారి స్నేహితులు కూడా పాల్గొన్నారు. గొడవ జరగడంతో తాండవేశ్వర్ సింగిల్ బ్యారల్ తుపాకితో భరత్‌పై కాల్పులు జరిపాడు. బుల్లెట్ మిస్సయి గోడకు తగిలింది. దీంతో భరత్ క్షేమంగా బయటపడ్డాడు. భరత్ ఫిర్యాదు మేరకు పోలీసులు తాండవేశ్వర్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
సినిమా పూర్తి చేయలేదని ఆగ్రహం
రూ. 6 లక్షల కోసం కాల్పులు
Comments
Please login to add a commentAdd a comment