నరభక్షక చిరుత కోసం గాలింపు
దొడ్డబళ్లాపురం: నెలమంగల తాలూకా కంబాళు గొల్లరహళ్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం పశువుల మేత కోసం బయటకు వెళ్లిన మహిళను చిరుత చంపి దేహాన్ని పాక్షికంగా ఆరగించడంతో స్థానికంగా భయాందోళనలు వ్యాపించాయి. పరిసర గ్రామాల ప్రజలకు నిద్ర కరువైంది. బయటకు వెళ్లాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు పోలీసులు, అటవీశాఖ అధికారులు నర భక్షకురాలి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. డ్రోన్ సాయంతో కంబాళు గొల్లరహళ్లి చుట్టుపక్కల అటవీప్రాంతంలో వెతుకులాట సాగుతోంది. చిరుత మహిళను చంపిన ప్రదేశానికి 200 మీటర్ల దూరంలో అంగనవాడి కేంద్రం ఉంది. చిరుత భయంతో అంగనవాడి కేంద్రాన్ని మూసివేశారు.
డిసెంబరు 9 నుంచి అసెంబ్లీ
శివాజీనగర: శాసనసభ శీతాకాల సమావేశాలు బెళగావిలో డిసెంబర్ 9 నుంచి 20 వరకు జరుగుతాయి. మంగళవారం విధానసౌధలో విలేకరుల సమావేశంలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హెచ్.కే.పాటిల్ ఈ మేరకు తెలిపారు. ఈ విషయమై గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు ఫైల్ పంపించామని, ఆమోదం లభించిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment