స్కూల్ టూర్ బస్సు.. చెట్టుకు ఢీ
శివమొగ్గ: పాఠశాల విద్యార్థులతో స్టడీ టూర్‌కి బయలుదేరిన బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, 29 మందికి మామూలు గాయాలు తగిలాయి. ఈ సంఘటన జిల్లాలోని హొసనగర తాలూకా మండళ్లి సమీపంలోని నర్తిగె గ్రామం వద్ద సోమవారం జరిగింది.
వివరాలు.. చామరాజనగర యళందూరుకు చెందిన ఎస్‌డీఎం పాఠశాల విద్యార్థులతో బస్సు విద్యా పర్యటనకు బయలుదేరింది. మార్గమధ్యంలో డ్రైవర్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టాడు, బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదంలో చామరాజనగర జిల్లా మసణపురకు చెందిన బస్సు డ్రైవర్ సురేష్ (50) తలకు బలమైన గాయాలయ్యాయి. చామరాజనగర దేశవళ్లివాసి ఉపాధ్యాయినులు నందిని (50), మళందూరు టౌన్‌వాసి నీలాంబరి (28), శశికళ (35)లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో 29 మంది ఉండగా, మిగతా వారికి చిన్న చిన్న గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే రెండు అంబులెన్స్‌ల్లో హొసనగరలోని తాలూకా ఆస్పత్రిలో చేర్పించారు. కొందరిని మెరుగైన చికిత్స కోసం శివమొగ్గలోని మెగ్గాన్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులతో కలిసి స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడానికి సహాయపడ్డారు. హొసనగర ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంపై బాధితుల్లో ఆక్రోశం వ్యక్తమైంది.
డ్రైవర్, ముగ్గురు టీచర్లకు తీవ్ర గాయాలు
శివమొగ్గ జిల్లాలో దుర్ఘటన
Comments
Please login to add a commentAdd a comment